Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్లకు దిమ్మదిరిగిపోయే షాక్...

టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. ద్వంద్వ ప్రయోజనాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, భారత క్రికెటర్లు తమతమ ఉద్యోగాలను వదులుకోవాలని సూచన చ

Webdunia
గురువారం, 27 జులై 2017 (19:14 IST)
టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. ద్వంద్వ ప్రయోజనాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, భారత క్రికెటర్లు తమతమ ఉద్యోగాలను వదులుకోవాలని సూచన చేసింది. 
 
వాస్తవానికి ద్వంద్వ ప్రయోజనాలకు బీసీసీఐ వ్యతిరేకం. ఈనేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈనేపథ్యంలో బీసీసీఐలో ఏ, బీ, సీ గ్రేడ్ కాంట్రాక్టులతో ప్రయోజనం పొందుతున్న ఆటగాళ్లు, పలు సంస్థల్లో ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ద్వంద్వ ప్రయోజనం పొందుతున్నారు. 
 
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓఎన్జీసీలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారాలు ప్రభుత్వ సంస్థల్లో వివిధ స్థాయి ఉద్యోగులుగా ప్రయోజనాలు పొందుతున్నారు. 
 
ఈనేపథ్యంలో పని చేస్తున్న సంస్థలకు రాజీనామా చేయాలని కోరుతూ బీసీసీఐ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉత్తర్వులు టీమిండియాకు మాత్రమేనా? మహిళా క్రికెట్ జట్టుకు కూడా వర్తిస్తుందా? అన్న దానిపై పూర్తి వివరాలు తెలియలేదు. మహిళా క్రికెటర్లలో కొందరు రైల్వేల్లో ఉద్యోగులుగా ఉన్నారు. మిథాలీ రాజ్ రైల్వే శాఖలో ఉద్యోగిణి అన్న సంగతి తెలిసిందే. మొత్తంమీద బీసీసీఐ క్రికెటర్లకు షాకిచ్చింది. 

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments