Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిశాస్త్రికి ఉద్వాసన? కొత్త కోచ్ వేటలో బీసీసీఐ (Video)

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (11:52 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. అయితే, భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నారు. ఈయన కాంట్రాక్టు వరల్డ్ కప్‌తోనే ముగిసింది. కానీ, వెస్టిండీస్ పర్యటన వరకు పొడగించారు. ఆ తర్వాత కొత్త కోచ్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుంది. 
 
అయితే, వరల్డ్ కప్‌లో భారత్ కథ సెమీస్‌లోనే ముగియడంతో కోచ్ రవిశాస్త్రికి మరో అవకాశంగానీ, మరోమారు పదవీకాలం పొడిగింపుగానీ ఉండే అవకాశం లేదన్నది బీసీసీఐ వర్గాల సమాచారం. రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌‌లతో పాటు, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌‌ల స్థానంలోనూ కొత్తవారిని ఎంపిక చేయాలన్న భావనలో బీసీసీఐ పెద్దలు ఉన్నారు. 
 
ఇప్పటికే భారత ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసులు బీసీసీఐ ఇంటికి పంపించిన విషయం తెల్సిందే. వెస్టిండీస్ పర్యటన తర్వాత, సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే పోటీల సమయానికి కొత్త కోచ్, అతని సహాయకుల ఎంపిక పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. మరి కొత్త కోచ్‌గా ఎవరు వస్తారన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments