Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కీలక నిర్ణయం.. ప్రేక్షక్షులు లేకుండా మ్యాచ్‌లు.. ఆ టోర్నీలు రద్దు?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (10:35 IST)
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న వినూ మాన్కడ్‌ ట్రోపీ సహా అన్ని విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల బోర్డులకు సమాచారం అందించారు. కరోనా ఉదృతంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
 
అలాగే టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య 5 టీ20ల సిరీస్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ.. కరోనా కారణంగా మిగతా మూడూ టీ20లతో పాటు రానున్న వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనుంది.

ఇప్పటికే మంగళవారం జరిగిన మూడో టీ20లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరిగిందని.. మిగతా మ్యాచ్‌లు అలాగే నిర్వహిస్తామని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. 
 
ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్ 14పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఏప్రిల్ లోగా కరోనా ఉదృతి కోనసాగితే ఐపీఎల్ కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకుంటే ఇతర దేశంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. గత ఏడాది ఐపీఎల్-13 బయోబుడగ నీడలో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments