Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ తీరు ఇదేనా? ఐపీఎల్‌పై వున్న శ్రద్ధ.. టెస్టుల మీద లేదే: గంభీర్

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించారు. క్రికెట్ చరిత్రకారుడు బ

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (09:12 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించారు. క్రికెట్ చరిత్రకారుడు బొరియా మజుందార్ రాసిన ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న గంభీర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 
 
బీసీసీఐ తీరును తప్పుబట్టిన గంభీర్.. ఐపీఎల్‌ను మార్కెట్ చేసే బీసీసీఐ టెస్టుల విషయంలో మాత్రం ఏ మాత్రం శ్రద్ధ చూపట్లేదని విమర్శలు గుప్పించాడు. వన్డేలు, ట్వంటీ-20ల మార్కెట్ కోసం తాపత్రయపడుకున్నంతగా టెస్టు క్రికెట్‌ను మార్కెట్ చేసేందుకు బీసీసీఐ ఆసక్తి చూపట్లేదనిపిస్తోందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
 
ఇందుకు 2011లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో తొలిరోజు భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో ఉన్నది వెయ్యిమందేనని గంభీర్ గుర్తు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు ఆడుతున్న మ్యాచ్‌ను వెయ్యి మంది మాత్రమే చూస్తున్నారంటే.. ఎలా ఉంటుందో ఊహించండని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments