ఇంకా తగ్గని ఆసియా కప్ ఫైనల్ వేడి... నఖ్వీపై బీసీసీఐ ఫిర్యాదు

ఠాగూర్
బుధవారం, 1 అక్టోబరు 2025 (09:39 IST)
దుబాయ్ వేదికగా ఆసియా క్రికెట్ కప్ టోర్నీ జరిగింది. ఇందులో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఫలితంగా తొమ్మిదో సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. అయితే, ఈ ఫైనల్ ముగిసిపోయి మూడు రోజులు అయింది. కానీ, ఆ ఫైనల్ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. 
 
అయితే, ట్రోఫీ ప్రజెంటేషన్‌లో ఓ ఆసక్తిర సంఘటన జరిగింది. ఆసియా క్రికెట్ టోర్నీ చైర్మన్‌గా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ట్రోఫీని విజేత జట్టుకు ఇవ్వకుండా తనవద్దే పెట్టుకున్నారు. అలాగే, మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్‌ కెప్టెన్ సల్మాన్ అఘా చేసిన ప్రకటన ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి. ఇప్పటికే బీసీసీఐ తన అసంతృప్తిని వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. వారిద్దరిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది.
 
ఆసియా కప్‌ ట్రోఫీని ఇవ్వకుండా తనతోపాటు తీసుకెళ్లడంపై ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ట్రోఫీని భారత్‌కు అప్పగించేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ‘అదేమీ అతడి వ్యక్తిగత సొత్తు కాదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ది’ అని బీసీసీఐ ఘాటుగా స్పందించింది. 
 
అయినా సరే, మొండిపట్టుదలతో నఖ్వీ కండీషన్లు పెట్టాడు. తమకు వెంటనే అప్పగించాలని బీసీసీఐ అధికారులు కోరగా.. వ్యక్తిగతంగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ తన వద్దకు రావాలని నఖ్వీ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ మాత్రం అంగీకరించకుండా.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏసీసీ ఏజీఎంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా గట్టిగానే ప్రశ్నించారు. తన ఆఫీస్‌కు భారత సారథిని రప్పించి పైచేయి సాధించినట్లు ప్రగల్భాలు పలకడమే నఖ్వీ నక్కజిత్తుల ప్లాన్‌ అంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments