Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ 2015 : ఆప్ఘనిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (17:40 IST)
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పూల్ ఏ గ్రూపులో బంగ్లాదేశ్ జట్టు విజయభేరి మోగించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆప్ఘనిస్థాన్ జట్టును 105 పరుగుల తేడాతో చిత్తుచేసింది. కాన్ బెర్రాలో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసిన విషయం తెల్సిందే.
 
ఆ తర్వాత 268 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘన్ కూనలు 42.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయ్యారు. ఆ జట్టులో కెప్టెన్ మహ్మద్ నబి (44) టాప్ స్కోరర్‌గా నిలువగా... సమియుల్లా షెన్వారీ 42 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో ఆఫ్ఘన్ జట్టుకు ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో మొర్తజాకు 3 వికెట్లు దక్కాయి. షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశాడు. 
 
అంతకుముందు, టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో వికెట్ కీపర్ అయిన రహీం (71) అద్భుతంగా రాణించగా, ఓపెనర్లు హక్యు 29, ఇక్బాన్ 19, సర్కర్ 28, మహ్మదుల్లా 23, షాకిహ్ అల్ హాసన్ 63, మోర్తాజా 14 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 13 రన్స్ వచ్చాయి. ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో, బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments