Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : బంగ్లాదేశ్‌పై చమటోడ్చి నెగ్గిన శ్రీలంక

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (11:02 IST)
స్వదేశంలో జరుగుతున్న ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా, ఆతిథ్య శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. పర్యాటక బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చమటోడ్చి నెగ్గింది. గురువారం పల్లెకెలెలో గ్రూపు-బి మ్యాచ్‌లో శ్రీలంక - బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఇందులో లంక జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 165 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు మరో 11 ఓవర్లు మిగిలుండగానే ఛేదించారు. లక్ష్యఛేదనలో శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది.
 
అంతకుముందు, బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అది ఎంత పొరపాటు నిర్ణయమో బంగ్లా బ్యాటింగ్ చూస్తే అర్థమవుతోంది. ఆ జట్టు 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం, ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్ కూడా ఆరంభంలో కుదుపులకు గురైంది. ఓ దశలో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంక జట్టును సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక అర్థసెంచరీలతో ఆదుకున్నారు. 
 
వీరిద్దరూ విలువైన భాగస్వామ్యం నమోదు చేసి తమ జట్టును గెలుపు దిశగా నడిపించారు. సమరవిక్రమ 77 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేయగా, చరిత్ అసలంక 92 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ షకీబల్ హసన్ 2, తస్కిన్ అహ్మద్ 1, షోరిఫుల్ ఇస్లామ్ 1, మెహెదీ హసన్ 1 వికెట్ తీశారు. ఆసియా కప్ టోర్నీలో తదుపరి మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య సెప్టెంబరు 2న జరగనుంది. ఈ దాయాదుల సమరం పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ గడ్డలో టీడీపీ పుట్టింది.. పూర్వ వైభవం ఖాయం.. బాబు

తెలంగాణకు మంచి పునాది ఉంది.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు

భక్తులకు వాటర్ బాటిళ్లు ఆ ధరకే విక్రయించాలి.. టీటీడీ వార్నింగ్

ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

తర్వాతి కథనం
Show comments