Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : స్టోయిన్స్ వీరవిహారం.. కంగారుల చేతిలో లంక చిత్తు

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:32 IST)
సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు తేరుకుంది. ఆ జట్టు ఆటగాడు స్టోయిన్స్ వీర విహారం చేయడంతో శ్రీలంక జట్టును కంగారులు చిత్తు చేశారు. మొత్తం 20 ఓవర్లలో లంక జట్టు 157 పరుగులు చేసింది. ఆ తర్వాత 158 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టులో స్టాయినిస్ 18 బంతుల్లో 59 పరుగులతో విరుచుకుపడటంతో ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.
 
సూపర్-12 విభాగంలో భాగంగా, మంగళవారం ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌‍లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్  చేతిలో ఘోర పరాజయం ఎదురైన సంగతి తెల్సిందే. ఈ ఓటమి నుంచి తేరుకునే విధంగా మంగళవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో కంగారులు అన్ని విభాగాల్లో రాణించారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు 20 ఓవర్లలో 157 పరుగులుచేసింది. ఆ జట్టులో నిస్సంక (40), డిసిల్వా (26), ఛరిత్ అసలంక (38 నాటౌట్)లు మాత్రమే రాణించారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ జట్టులో వార్నర్ (11), ఆరోన్ (31), మిచెల్ మార్షల్ (18), మ్యాక్స్‌వెల్ (23), మార్క్ స్టోయినిస్ (59 నాటౌట్) రాణించారు. స్టోయినిస్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 18 బంతుల్లో ఆరు సిక్స్‌లు, నాలుగు ఫోర్ల సాయంతో 327.77 స్ట్రైక్ రేటుతో వీర విహారం చేశాడు. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు ఘన విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayashanthi: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. విజయం ఖాయమేనా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

తర్వాతి కథనం
Show comments