Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన పీఠాన్ని అధిరోహించాలనివుంది : గౌతం గంభీర్

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (11:13 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్తుతం రాజకీయ నేతగా మారిపోయారు. భారత క్రికెట్ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను చేకూర్చి పెట్టిన ఈ ఢిల్లీ ఎడం చేతి ఓపెనర్ గౌతం గంభీర్ ఇపుడు ఫక్తు రాజకీయ నేత అయ్యారు. ఆయన బీజేపీ తరపున ఎంపీగా కూడా పోటీ చేసి విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను వెల్లడించారు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఉందని చెప్పుకొచ్చారు. అది జరిగితే తన కల నెరవేరినట్టేనని వెల్లడించాడు. 'ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప గౌరవం. అతి పెద్ద బాధ్యత కూడా. అదే జరిగితే నా కల నెరవేరినట్టే' అని శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌ తెలిపాడు. 
 
ఇక.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై గంభీర్‌ మరోసారి విమర్శలు గుప్పించాడు. గుంతలు తేలిన ఢిల్లీ రహదారులను తక్షణమే బాగు చేయనున్నట్టు కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనపై తనదైనశైలిలో వ్యంగ్యోక్తులు విసిరాడు. ఈ సందర్భంగా ప్రఖ్యాత హిందీ పాట 'బాబూజీ ధీరే చల్నా'ను ఉటంకిస్తూ 'ఢిల్లీ రోడ్లులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అందువల్ల నెమ్మదిగా వెళ్లండి' అని గంభీర్‌ సెటైర్లు వేశాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments