Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ : భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. జట్టుకు దూరమైన అక్షర్ పటేల్

స్వదేశంలో పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు ముందు.. భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే షమి, రహానే, రోహిత్ గాయాల కారణంగా జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే.

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (14:53 IST)
స్వదేశంలో పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు ముందు.. భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే షమి, రహానే, రోహిత్ గాయాల కారణంగా జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. ఇపుడు చెన్నై టెస్టులో గాయపడిన అక్షర్ పటేల్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన జయంత్ యాదవ్ వన్డే, టీ-ట్వంటీ సిరీస్‌కు దూరమవనున్నాడు. అదేవిధంగా టెస్ట్‌ సిరీస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన అశ్విన్‌, జడేజాలు వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.
 
అశ్విన్‌, జడేజాలు మిస్‌ అయితే.. అమిత్ మిశ్రా స్పిన్‌ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌, మిగతా పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు మిశ్రాకు తోడుగా భారాన్ని పంచుకోనున్నారు. గాయం కారణంగా వన్డేలకు దూరమైన పేసర్‌ షమి స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకోనున్నట్టు తెలిసింది. కాగా, ఇంగ్లండ్‌తో జనవరి 15న నుంచి వన్డే సిరీస్ ఆరంభంకానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

తర్వాతి కథనం
Show comments