మెల్‌బోర్న్ టీ20 మ్యాచ్ : చేతులెత్తేసిన భారత్ - ఆస్ట్రేలియా గెలుపు

ఠాగూర్
శుక్రవారం, 31 అక్టోబరు 2025 (19:34 IST)
మెల్‌బోర్నే వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సమిష్టగా విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఫలితంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆది నుంచి దూకుడుగా ఆడింది. 
 
ఆసీస్ ఓపెనర్లలో మిచెల్‌ మార్ష్‌ 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 46 పరుగులతో రాణించాడు. అతడు ఔట్‌ కావడానికి ముందు రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 7.6 ఓవర్‌లో కుల్దీప్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ 15 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 28 పరుగులు చేశాడు. ట్రావిడ్ హెడ్ క్రీజులో ఉన్నంత వరకు దూకుడుగానే ఆడాడు. జోస్‌ ఇంగ్లిస్‌ 20 బంతుల్లో 20 రన్స్ చేశాడు.  
 
ఇకపోతే, భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్‌లో రాణించిన హర్షిత్‌ రాణా.. బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరులో భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసుకున్నప్పటికీ ఆసీస్‌ను మాత్రం నిలువరించలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

మోహన్ బాబు యూనివర్సిటీలో సమర్థ 2025, 36-గంటల జాతీయ హ్యాకథాన్

Montha Cyclone: జగన్‌కి తుఫాను గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. రవి కుమార్

డీప్ ఫేక్‌లపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి... ఇక వారికి చుక్కలేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

తర్వాతి కథనం
Show comments