Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మశాల టెస్ట్ : ముగిసిన రెండో రోజు టెస్ట్.. భారత్ 248/6.. పుజరా రికార్డు

ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌ ఆరంభంలో భారత జట్టు తడబడినప్పటికీ... ఆ

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (17:12 IST)
ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌ ఆరంభంలో భారత జట్టు తడబడినప్పటికీ... ఆ తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా కరుణ్ నాయర్ (5) మినహా భారత్ బ్యాట్స్‌మన్ అంతా ఆకట్టుకోవడం విశేషం. 
 
రెండో రోజు పిచ్ కాస్త ఎక్కువ బౌన్స్ అయింది. దీంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. దీంతో ఓపెనర్లు మురళీ విజయ్ (11), కేఎల్ రాహుల్ (60) పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో మురళీ విజయ్‌ను హేజిల్ వుడ్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం రాహుల్‌కు ఛటేశ్వర్ పుజారా (57) జత కలిశాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతున్న దశలో అర్థ సెంచరీతో సత్తా చాటిన రాహుల్‌ను కుమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో పుజారాకు కెప్టెన్ అజింక్యా రహానే (46) జత కలిశాడు. వీరిద్దరూ రెండో సెషన్‌ను సమర్ధవంతంగా పూర్తి చేశారు. 
 
అర్థ సెంచరీ సాధించిన పుజారాను లియాన్ బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే కరుణ్ నాయర్‌ను, అనంతరం రహానేను, ఆ తర్వాత రవి చంద్రన్ అశ్విన్ (30)ను వరుసగా పెవిలియన్‌కు పంపి లియాన్ భారత్‌కు షాకిచ్చాడు. క్రీజులో సాహా (10)కు జతగా రవిచంద్రన్ అశ్విన్ (16) ఉన్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగులు వెనుకబడ్డ భారత జట్టు 91 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. 
 
ఇదిలావుండగా, అద్భుత ఆటతీరుతో భారత జట్టు వెన్నుముకగా నిలుస్తున్న ఛతేశ్వర పూజారా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో ఒక సీజన్‌లో టెస్టు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పూజారా(1288) రెండో స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందుకు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(1483) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పూజారా తర్వాత హెడెన్‌(1287), గంభీర్‌(1269), లారా(1253) ఉన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments