ఓ ఇంటివాడు కాబోతున్న కేఎల్ రాహుల్ - 23న వివాహం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (16:10 IST)
భారత క్రికెట్ జట్టు క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 23వ తేదీన ఆయన పెళ్లి జరుగనుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని ఆయన వివాహం చేసుకోనున్నాడు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. 
 
గత కొంతకాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెల్సిన ఇరువురి కుటుంబ సభ్యలు కూడా వారి ప్రేమకు సమ్మతించి, పెళ్లి చేసేందుకు అంగీకరించారు. అయితే, వీరిద్దరి వివాహ ఘట్టం మాత్రం ఆలస్యమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ఈ వివాహానికి ఆహ్వానించే అతిథుల జాబితాను ఇప్పటికే సిద్దం చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, జాకీష్రాఫ్, అక్షయ్ కుమార్, క్రికెట్ రంగం నుంచి ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లు ఈ వివాహానికి హాజరుకానున్నారు. ఈ వివాహం ముంబై నగరంలోని ఖండాలాలో జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments