Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రికెట్ కప్ : కోహ్లీకి విశ్రాంతి... రోహిత్ శర్మకు సారథ్యం

ఆసియా క్రికెట్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియాను ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో జట్టును ప్రకటించగా, రెగ్యులర్ కెప్

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (18:37 IST)
ఆసియా క్రికెట్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియాను ప్రకటించింది. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో జట్టును ప్రకటించగా, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అలాగే, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధవాన్‌ను ఎంపిక చేశారు.
 
కాగా ఇటీవల యోయో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన అంబటి రాయుడు ఈ సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాక.. రాజస్థాన్‌కు చెందిన ఖలీల్ అహ్మద్‌కు తొలిసారి జట్టులో చోటుకల్పించారు. ఇంగ్లండ్‌ పర్యటనలో గాయపడిన భువనేశ్వర్ కుమార్ ఈ మధ్యే కోలుకోవడంతో అతన్ని కూడా జట్టులోకి తీసుకున్నారు. 
 
దీనిపై చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందిస్తూ, 'గత కొద్దికాలంగా కోహ్లీ మూడు ఫార్మాట్లు విశ్రాంతి లేకుండా ఆడుతున్నాడు. అందుకే అతనిపై పడుతున్న వర్క్‌లోడ్‌ని దృష్టిలో పెట్టుకొని అతనికి విశ్రాంతి కల్పించాం. భవిష్యత్తు టోర్నీలు కూడా దృష్టిలో పెట్టుకొని అతనికి విశ్రాంతి ఇచ్చాం' అని చెప్పారు. 
 
భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ(కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌, హార్థిక్ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజవేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

తర్వాతి కథనం
Show comments