Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : మళ్లీ తలపడనున్న భారత్ - పాకిస్థాన్.. ఎపుడు.. ఎలా...

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (23:00 IST)
దుబాయ్ వేదికగా ఆసియా దేశాల మధ్య క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఈ ఆసియా కప్ టోర్నీలో ఇప్పటివరకు సూపర్-4కు ఆప్ఘనిస్థాన్, భారత్, పాకిస్థాన్ జట్లు చేరుకున్నాయి. అయితే, శుక్రవారం వరకు ఆయా జట్లు సాధించిన గెలుపోటముల మేరకు వచ్చే ఆదివారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోమారు తలపడనున్నాయి. తాజాగా జరిగిన హాంకాంగ్‌తో పాకిస్తాన్ ఆడిన మ్యాచ్‌తో ఈ విషయం స్పష్టమైంది. 
 
శుక్రవారం హాంకాంగ్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఆటగాడు రిజ్వాన్ (78 నాటౌట్), ఫకర్ జమాన్ (53), ఖుష్‌దిల్ షా (35 నాటౌట్)లు చెలరేగి ఆడటంతో పాక్ జట్టు భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు పాక్ బౌలర్ల ధాటికి కేవలం 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఇచ్చిన 10 అదనపు పరుగులు, ఆ తర్వాత కెప్టెన్ నిజాఖత్ ఖాన్ చేసిన 8 పరుగులు అత్యధికం కావడం గమనార్హం. పాక్ బౌలర్ల బౌలింగ్‌ను హాంకాంగ్ ఆటగాళ్ళు ఏ దశంలోనూ అర్థం చేసుకోలేక పోయారు. 
 
ఈ విజయంతో పాకిస్థాన్ జట్టు సూపర్-4లోకి అడుగుపెట్టింది. దీంతో వచ్చే వారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరో క్రికెట్ సమరం జరుగనుంది. సూపర్-4 గ్రూపులో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఆ తర్వాత ఈ నెల 11వ తేదీన ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. 
 
అయితే, సూపర్-4లో తొలి మ్యాచ్ సెప్టెంబరు 3వ తేదీన ఆప్ఘనిస్థాన్ - శ్రీలంక జట్ల, రెండో సూపర్ మ్యాచ్ సెప్టెంబరు 4న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా, మూడో సూపర్ మ్యాచ్ శ్రీలంక - భారత్ మధ్య సెప్టెంబరు 6వ తేదీన, నాలుగో సూపర్ మ్యాచ్ పాకిస్థాన్ - ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబరు 7వ తేదీన జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments