Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:51 IST)
ఆసియా కప్ సూపర్ - 4 మ్యాచ్‌లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. దుబాయ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ సిరీస్‌లో ఫైనల్‌కు చేరాలంటే భారత్ శ్రీలంకతో పాటు.. మరో ఆప్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ టాస్ ఓడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇదిలావుంటే, శ్రీలంక కోసం ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క మార్పు చేసారు. బిష్ణోయి స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, రిషభ్ పంత్, పాండ్యా, హుడా, భువనేశ్వర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అర్షదీప్. 
 
శ్రీలంక : నిస్సంక, మెండిస్, ఆశలంక, గుణతిలక, శనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, ఫెర్నాండో, మదుశంక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

తర్వాతి కథనం
Show comments