Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ బౌలర్‌కు గుడ్ లక్ చెప్పిన అశ్విన్.. ఆ ఫీట్‌ను అందుకుంటే చూడాలనుంది..

యూరీ ఘటన, సర్జికల్ స్ట్రైక్స్‌కు అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఒక రకమైన పోటీ నెలకొంది. ప్రధానం క్రికెట్లో పోటీ మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌‌తో ఆడిన టెస్టు సిరీస్ సందర్భంగా రవిచం

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (18:49 IST)
యూరీ ఘటన, సర్జికల్ స్ట్రైక్స్‌కు అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఒక రకమైన పోటీ నెలకొంది. ప్రధానం క్రికెట్లో పోటీ మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌‌తో ఆడిన టెస్టు సిరీస్ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్ అద్భుత రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌కు ధీటుగా పాకిస్థాన్‌న్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఫైజాన్ లఖానీ... అశ్విన్ రికార్డును కనుమరుగు చేస్తూ, 'టెస్టుల్లో వేగంగా వంద వికెట్లు తీసిన ఆసియా బౌలర్ రికార్డు'ను సాధించేందుకు యాసిర్ షాకి ఇదే మంచి అవకాశం అంటూ ట్వీట్ చేశాడు.
 
అయితే అశ్విన్ ఈ ట్వీట్‌కు హుందాగా బదులిచ్చాడు. అశ్విన్ టెస్టుల్లో వంద వికెట్ల ఫీటును సునాయాసంగా 18 టెస్టుల్లోనే సాధించిన నేపథ్యంలో.. లఖానీ ట్వీట్‌కు స్పందిస్తూ.. యాసిర్ షాకి గుడ్ లక్.. అతని ప్రతిభకు హ్యాట్సాఫ్.. తన రికార్డును అతను అందుకుంటే చూడాలని వుంది అంటూ రీట్వీట్ చేశాడు. అశ్విన్ ట్వీట్‌తో లఖానీకి దిమ్మతిరిగివుంటుందని క్రీడా పండితులు సెలవిస్తున్నారు. ఇకపోతే.. వెస్టిండీస్‌తో 17వ టెస్టు ఆడుతున్న యాసిర్ షా ఇప్పటి వరకు 95 టెస్టు వికెట్లు పడగొట్టాడు. త్వరలో 100 వికెట్ల ఫీట్‌ను అతను అందుకోనున్నాడు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments