Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన అశ్విన్... 400 వికెట్ల క్లబ్‌లో చోటు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:30 IST)
భారత స్పిన్నర్ రవిచంద్రన్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ వికెట్ తీయడంతో అశ్విన్ టెస్టుల్లో 400వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ కేవలం 77 టెస్టుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు.
 
కాగా, అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో వికెట్ల పండగ నెలకొంది. స్పిన్నర్లకు ఇక్కడి పిచ్ స్వర్గధామంలా మారడంతో వికెట్లు టపటపా నేలరాలిపోయాయి. 
 
ఫలితంగా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. 
 
వేగంగా 400 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మొదటి స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ 72 టెస్టుల్లోనే 400 మార్కు అందుకున్నాడు. 
 
ఇప్పటిదాకా భారత్‌లో 400 పైచిలుకు వికెట్లు తీసింది అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) మాత్రమే. ఇప్పుడు అశ్విన్ కూడా వీరి సరసన చేరాడు. 

సంబంధిత వార్తలు

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments