Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాషెస్ సిరీస్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్.. లవ్ ప్రపోజ్.. లిప్ టు లిప్ కిస్

ఇదేంటి? స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ.. క్రికెట్ మ్యాచ్ చూడొచ్చా..? ఎక్కడ? అని అడుగుతున్నారు. కదూ.. అయితే చదవండి. ప్రతిష్టాత్మక యాషెస్‌ టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైంది. ఈ సిరీస్‌‌ను వీక్షించే

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (09:50 IST)
ఇదేంటి? స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ.. క్రికెట్ మ్యాచ్ చూడొచ్చా..? ఎక్కడ? అని అడుగుతున్నారు. కదూ.. అయితే చదవండి. ప్రతిష్టాత్మక యాషెస్‌ టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైంది. ఈ సిరీస్‌‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు అనువుగా గబ్బా స్టేడియాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. 
 
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే గబ్బా స్టేడియంలో స్టాండ్స్ తీసేసి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఈ పూల్‌లో జలకాలాడుతూ మ్యాచ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ వీక్షించే వెసులుబాటు కల్పించారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ను ఓ జంట ఉపయోగించుకుంది. 
 
తొలి టెస్టు రెండో రోజు లంచ్ విరామానికి వెళ్లిన ఆటగాళ్లు క్రీజులో అడుగుపెడుతున్న వేళ ప్రేమజంట మిచెల్, టోరీ స్విమ్మింగ్ పూల్ దగ్గర రొమాన్స్‌లో మునిగిపోయారు. ప్రతిష్ఠాత్మక యాషెస్ కంటే మంచి సందర్భం లేదనుకున్న మిచెల్.. పక్కనే వున్న ప్రియురాలు టోరీకీ ప్రపోజల్ పెట్టేశాడు. 
 
అంతే ఆమె కూడా కరిగిపోయి ఆమె ప్రేమను స్వీకరించింది. అంతే ఆమె చేతికి మిచెల్ ఉంగరం తొడిగాడు. ఆపై లిప్ టు లిప్ కిస్‌తో ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

తర్వాతి కథనం
Show comments