Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో చెత్త రికార్డును మూటగట్టుకున్న అర్జున్ టెండూల్కర్

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (11:12 IST)
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌ పోటీల్లో భాగంగా, శనివారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అర్జున్ టెండూల్కర్ ఈ రికార్డును మూటగట్టుకున్నాడు.
 
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున బరిలోకి దిగిన అర్జున్.. తన బౌలింగ్ స్పెల్‌లో తొలి ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. ఆ తర్వాత మాత్రం లూజు బంతులు వేయడంతో ప్రత్యర్థి బ్యాటర్లు రెచ్చిపోయారు. ఫలితంగా ధారణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అర్జున్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్ నిలిచాడు. 
 
గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడిన డేనియల్ శామ్స్ ఒకే ఓవర్‌లో 35 పరుగులు ఇచ్చాడు. ఇపుడు అర్జున్ టెండూల్కర్ 31 పరుగులు ఇచ్చి రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో ముగ్గురు బౌలర్లు ఉన్నారు. 2014లో బెంగుళూరుపై పవన్ సుయాల్, 2019లో రాజస్థాన్ రాయల్స్‌పై అల్జారీ జోసెఫ్, 2017లో పంజాబ్ కింగ్స్‌పై మిచెల్ మెక్ క్లెవాన్‌లు ఒకే ఓవర్‌లో 28 పరుగులు చొప్పున ఇచ్చాడు. 
 
అయితే, శనివారం జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తొలి ఓవర్‌ను అద్భుతంగా వేసి మంచి జోరుమీదున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఎడాపెడా పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ కెప్టెన్ శ్యామ్ కరణ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి 31 పరుగులు పిండుకున్నాడు. ఇందులో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, ఓ నోబాల్ ఫోర్, వైడ్ ఉంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ తీసి 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒక నోబాల్, నాలుగు వైడ్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments