Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ కుంబ్లేను కోహ్లీ అంతమాటన్నాడా?.. అందుకే క్రికెట్ జంబో అస్త్రసన్యాసమా?

దిగ్గజ స్పిన్నర్‌గా.. సారథిగా టీమిండియాకు ఎనలేని సేవలు అందించి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన క్రికెట్ జంబో అనిల్‌ కుంబ్లేను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా అవమానించాడా? అవుననే అం

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (13:58 IST)
దిగ్గజ స్పిన్నర్‌గా.. సారథిగా టీమిండియాకు ఎనలేని సేవలు అందించి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన క్రికెట్ జంబో అనిల్‌ కుంబ్లేను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా అవమానించాడా? అవుననే అంటున్నారు క్రికెట్ పండింతులు. దీనికి సంబంధించిన విరాట్ కోహ్లీ రాసిన లేఖ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
భారత క్రికెట్ జట్టు కోచ్‌ పదవి నుంచి కుంబ్లే అర్ధంతరంగా తప్పుకున్నాడు. తన అనుభవంతో.. గురువుగా భారత క్రికెట్‌కు మార్గనిర్దేశం చేయాలని ఆశించిన కుంబ్లే ఆ పనిని మధ్యలోనే ఆపేశాడు. ఆటగాడిగా జేజేలు అందుకున్న జంబో కోచ్‌గానూ మెరుగైన ఫలితాలతో అందరి అభిమానం చూరగొన్నా.. క్రికెటర్లకు మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయాడు..! 
 
ఫలితాలు రాబట్టేందుకు గురువుగా అతని కఠిన వైఖరి కెప్టెన్‌ కోహ్లీతో పాటు జట్టు సభ్యులకు రుచించకుండా పోయింది. ఫలితంగా కెప్టెన్ కోహ్లీతో మొదలైన అభిప్రాయభేదాలు చినికిచినికి గాలివానలా మారడంతో.. అనిల్‌ అస్త్రసన్యాసం చేశాడు. వీరిద్దరి మధ్య చెలరేగిన విభేదాల గురించి కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. 
 
తాజాగా బ‌య‌టికొచ్చిన విష‌యం సంచ‌ల‌నం రేపుతున్న‌ది. చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు రెండు రోజుల ముందు టీమ్ స‌మావేశంలో కోచ్ కుంబ్లేపై కోహ్లీ నోరు పారేసుకున్నాడ‌ట. అందుకే కుంబ్లే ఇంత స‌డెన్‌గా రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని, వెస్టిండీస్ టూర్ వ‌ర‌కు కొన‌సాగాల‌న్నా విన‌లేద‌ని టీమ్‌లోని వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఫైన‌ల్‌కు ముందు ఎప్ప‌టిలాగే టీమ్ మీటింగ్ నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా కుంబ్లేతో విరాట్ వాగ్వాదానికి దిగడ‌మే కాదు అత‌న్ని తిట్టిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు టీమ్‌లో ఎవ‌రూ నువ్వు కోచ్‌గా కొన‌సాగాల‌ని అనుకోవ‌డం లేద‌ని విరాట్ అన్న‌ట్లు తెలిసింది. అయితే కుంబ్లే మాత్రం జ‌రిగిందేదో జ‌రిగింది అని గొడ‌వ‌ను ఆపే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా కోహ్లీ విన‌క‌పోవ‌డంతో కుంబ్లే మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. దీంతో కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డ‌మే మంచిద‌ని భావించి.. విండీస్ టూర్ వ‌ర‌కు కొన‌సాగాల‌న్నా రాజీనామా చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments