Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌‌లో హషీమ్ ఆమ్లా: షాన్ మార్ష్ స్థానంలో బరిలోకి?

Webdunia
బుధవారం, 4 మే 2016 (17:20 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా అరంగేట్రం చేయబోతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన వేలానికి వచ్చినా ఆమ్లా అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో గాయపడిన షాన్ మార్ష్ స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆమ్లాను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.  
 
కాగా మే ఒకటో తేదీన జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గుజరాత్ లయన్స్ జట్టుపై గెలుపును నమోదు చేసుకుంది. రాజ్ కోట్ వేదికగా జరిగిన 28వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు సత్తా చాటడంతో ఐపీఎల్ 9లో రెండో విజయం సాధించింది. 
 
154 పరుగులకు పంజాబ్ ఆలౌట్ అయ్యింది. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ బ్యాట్స్ మన్‌కు పంజాబ్ బౌలర్లు బంతితో నిప్పులు చెరిగి, తిరుగులేని లైన్ అండ్ లెంగ్త్‌తో చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

HMPV: బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్?

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తాను.. దిల్ రాజు

పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్... 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్!

టాలెంట్ ఉంటే ఫలితం లేదు... బిహేవియర్ ముఖ్యం .. చిరంజీవి డైరెక్ట్ పంచ్ (Video)

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

తర్వాతి కథనం
Show comments