Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాయుడు తండ్రి అయ్యాడు.. 11 ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్

Webdunia
సోమవారం, 13 జులై 2020 (16:12 IST)
Ambati Rayudu
హైదరాబాదీ స్టార్ క్రికెట్ అంబటి రాయుడు తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి చెన్నుపల్లి విద్య ఆదివారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అంబటి రాయుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తండ్రి అయ్యాడనే విషయాన్ని సీఎస్‌కే ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది.
 
చిన్నారి, విద్యలతో కలిసి రాయుడు దిగిన ఫొటోను కూడా షేర్‌ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎస్‌కే ఆటగాడు సురేష్‌ రైనా కూడా రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
పండంటి పాపకు జన్మనిచ్చిన రాయుడు, విద్య దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ అభినందించాడు. చిన్నారితో గడిపే ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందించండి. మీరు ఎప్పుడూ ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. 
 
ఇకపోతే.. భారత క్రికెటర్ అంబటి రాయుడు గురించి అందరికి తెలుసు. అయితే గత సంవత్సర కాలంగా రాయుడు కెరీర్‌ కష్టాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత అంబటి రాయుడు తండ్రి అయ్యాడు. 2009లో చెన్నుపల్లి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంబటి రాయుడు. ఇక ఆదివారం విద్య ఓ పాపకు జన్మనిచ్చింది. 
 
ఇక రాయుడు 2018 నుండి ఐపీఎల్‌లో సీఎస్కే తరపున ఆడుతున్నాడు. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ కోసం తనను ఎంపిక చేయకపోవడంతో నిరాశకు గురైన రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ తర్వాత దానిని వెనక్కి తీసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments