Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి టెస్టుకు ముందు భారత్‌కు బ్యాడ్ న్యూస్... ఏంటది?

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (13:08 IST)
బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, భారత్ -  ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య శుక్రవారం నుంచి చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా, ఇప్పటివరకు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ముగియగా, ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ నేపథ్యంలో సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దు అయినా, మ్యాచ్ డ్రా అయినా టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంటుంది. దీంతో చివరి టెస్ట్ మ్యాచ్‌ను భారత్ పకడ్బందీగా, అత్యుత్తమ జట్టుతో ఆడాల్సివుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఓ బ్యాడ్ న్యూస్ ప్రకటించారు. 
 
సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు పేసర్ ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడని, అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని గంభీర్ ప్రకటించాడు. సిడ్నీ పిచ్‌ను పరిశీలించిన అనంతరం తుది జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జ రిగిన ప్రీ మ్యాచ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పరిణామంతో మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కాగా, ఆకాశ్ దీప్ రెండు టెస్టుల్లో కలిపి 87.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫీల్డర్లు మరికొన్ని క్యాచ్‌లను జారవిడిచారు. ఈ క్రమంలో ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం 2025: ఒంటరిగా శక్తిని పెట్టుబడి పెట్టే వ్యక్తి..

ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి (Video)

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి

వైవిధ్యమైన పాత్రలో రామ్ పోతినేని - మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌

రాజమౌళి స్పందన గురించి గేమ్ చేంజ‌ర్‌ చిత్ర యూనిట్ ఆసక్తి

నాని సినిమా హిట్ 3 కాశ్మీర్ లో షూటింగ్ - సినిమాటోగ్రాఫర్ కే ఆర్ క్రిష్ణ మ్రుతి

తర్వాతి కథనం
Show comments