బాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెట్ లవర్ బాయ్ డేటింగ్!

లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి. ఈయన క్రికెటర్‌గా మాంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అనేక మంది అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. అలా ఆటతో పాటు.. అమ్మాయిలతో జల్సాలు సాగించాడు. ఇపుడు భ

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (13:17 IST)
లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి. ఈయన క్రికెటర్‌గా మాంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అనేక మంది అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. అలా ఆటతో పాటు.. అమ్మాయిలతో జల్సాలు సాగించాడు. ఇపుడు భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.
 
నిజానికి ఇప్పుడు జట్టులో ఉన్న ప్లేయర్స్‌ను కూడా అలాగే ఎంజాయ్ చేయనివ్వాలి అని శాస్త్రి తరచూ చెబుతుంటాడు. అప్పట్లో బాలీవుడ్ నటి అమృతాసింగ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఆ తర్వాత వాళ్ల బంధం తెగిపోయింది. రీతూను పెళ్లి చేసుకున్నా.. పదేళ్ల నుంచి వేరుగానే ఉంటున్నారు. 
 
ఇప్పుడు 56 ఏళ్ల వయసులో ఓ కొత్త తోడు కోసం రవి గాలిస్తున్నాడట. ఇప్పుడు కూడా అతని కన్ను ఓ బాలీవుడ్ నటిపైనే పడింది. ఆమె పేరు నిమ్రత్ కౌర్. రవిశాస్త్రి కంటే వయసులో 20 ఏళ్లు చిన్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన 'ఎయిర్‌లిఫ్ట్' మూవీతో నిమ్రత్ ఫేమసైంది. ఈ ఇద్దరూ రెండేళ్ల నుంచి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది. 
 
నిజానికి 2015 నుంచి ఈ ఇద్దరిని లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తమ కొత్త కార్ల లాంచింగ్‌కు పిలుస్తోంది. గత మూడేళ్లుగా ఎన్నో మోడల్స్‌ను రవి, నిమ్రత్ కలిసి లాంచ్ చేశారు. అయితే ఆ కొత్త కార్లు వీళ్ల మనసుల్ని కూడా కలిపాయన్న సంగతి ఇప్పుడే బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments