Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిక్క రేగింది.. కుర్చీని బ్యాటుతో కొట్టాడు.. పగిలిపోయింది..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:22 IST)
మైదానంలో రాణించకపోవడం.. పెవిలియన్ దారి పట్టడంతో టీవీలు పగుల కొట్టిన క్రికెటర్ల స్టోరీలు వినేవుంటాం. తాజాగా  ఆసిస్ ఓపెనర్ అరోన్ ఫించ్ కాస్త భిన్నంగా ప్రవర్తించాడు. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బిగ్‌బాస్ లీగ్ ఫైనల్లో రనౌటైన అరోన్ ఫించ్.. పెవిలియన్‌కి వెళ్తూ మధ్యలో దారి పక్కన ఉన్న కుర్చీని బ్యాట్‌తో విరగొట్టేశాడు. 
 
మెల్‌బోర్న్ రెనిగేడ్స్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్ రెనిగేడ్స్ తరఫున లీగ్‌లో ఆడిన అరోన్ ఫించ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రనౌటయ్యాడు. సహచరుడు కామెరూన్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు బౌలర్ జాక్సన్ బంతిని పాదంతో ఆపే ప్రయత్నం చేశాడు. ఆ బంతి అతని పాదాన్ని తాకుతూ నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లను తాకింది. 
 
దీంతో పరుగు కోసం క్రీజు వెలుపలికి వెళ్లిన అరోన్ ఫించ్ రనౌటయ్యాడు. దీంతో మైదానాన్ని వీడుతూ.. అరోన్ ఫించ్.. దారికి అడ్డంగా వున్న కుర్చీని బ్యాటుతో కొట్టాడు. అది కాస్త విరిగిపోయి కూర్చుంది. ఇకపోతే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇకపోతే.. భారత్‌తో ఈనెల 24 నుంచి ఆస్ట్రేలియా జట్టు రెండు ట్వంటీ-20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు భారత్‌‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments