Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ ఫైనల్‌లో భారత్ గెలవాలని నాలుక కోసుకున్న వీరాభిమాని!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (10:18 IST)
అభిమానానికి హద్దు ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. అభిమానం హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన చదివితే తెలుస్తుంది. తమిళనాడులోని వేలూరుకు చెందిన సుధాకర్ అనే 21 యేళ్ళ యువకుడు క్రికెట్ అంటే ప్రాణం. అదీ భారత మ్యాచ్‌లతో మరింత పిచ్చి. దీంతో టీమిండియాకు వీరాభిమానిగా మారిపోయాడు. 
 
లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ వరకు భారత విజయాత్ర అప్రతిహతంగా సాగడంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా ప్రత్యర్థి కావడంతో టీమిండియా విజయం సాధించాలని బలంగా కోరుకున్నాడు. ఇందుకోసం తన ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించి... విజయం కోసం తన నాలుక కోసుకున్నాడు. 
 
అతడి చర్యను గమనించిన బంధువులు, స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆ హడావుడిలో తెగిపడిన నాలుక ముక్క తీసుకెళ్లకపోవడంతో మైక్రోసర్జరీ చేయడానికి వీలు కాలేదని వైద్యులు తెలిపారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసి నాలుకను అమర్చే ప్రయత్నం చేస్తామని వారు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కానీ, గురువారం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఏమాత్రం పోరాటం చేయకుండా చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. 

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments