Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆసీస్ విజయం.. హైలైట్స్

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (22:06 IST)
Pakistan
పాకిస్థాన్ గడ్డపై ఆస్ట్రేలియా సిరీస్ గెలుపును నమోదు చేసుకుంది. 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. గతంలో రిచీ బెనాడ్ (1959-60) సారథ్యంలో, 1998-99 ఏట మార్క్ టేలర్ కెప్టెన్సీలో, తాజాగా 2021-22లో పాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నెగ్గింది.  
 
ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్ట్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలి రెండు టెస్ట్‌లు ఫలితం లేకుండా ముగియడంతో సిరీస్ ఆసీస్ సొంతమైంది. 8 వికెట్లతో చెలరేగిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (5/56, 3/23)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. సిరీస్‌లో సెంచరీల మోత మోగించిన ఉస్మాన్ ఖవాజా(496)కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరించింది.
 
351 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలింది. ఈ  మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్థాన్ 235 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 227/3 స్కోర్ వద్ద డిక్లెర్ ఇచ్చింది.
 
ఆసీస్ -పాక్ టెస్టు సిరీస్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు 
496 - ఉస్మాన్ ఖవాజా (యావరేజ్ 165.33)
397 - అబ్ధుల్లా షఫీఖ్  (79.40)
390 - బాబర్ ఆజామ్ (78.00)
370 - ఇమామ్-ఉల్ -హక్ (74.00)
300 - హజర్ అలి (60.00)
 
పాక్-ఆసీస్ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు 
12 - పాట్ కమిన్స్ (22.50)
12 - నాథన్ లియోన్  (యావరేజ్ 44.83)
9 - షహీన్ షా అఫ్రిది (36.44)
9 - నౌమన్ అలీ (42.22)
8 - మిట్చెల్ స్టార్క్  (34.12)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments