Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లికి 'Tie' కట్టిన హోప్... 123 నాటవుట్... ఏం చేస్తాం?

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (21:56 IST)
అఫ్‌కోర్స్... క్రీడల్లో అనుకున్నవి తలకిందులు కావడం మామూలే. విశాఖపట్టణంలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే పోటీ టైగా ముగిసింది. 322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసి టైగా ముగించింది. విండీస్ ఆటగాడు హోప్ వికెట్ల వద్ద పాతుకుపోయాడు. 134 బంతుల్లో 123 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. మిగిలినవారు కూడా తమవంతు ఆట తీరును ప్రదర్శించడంతో భారత్ విజయం జారిపోయింది. టైగా ముగిసింది. 
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోహ్లిసేన 321 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి వీర విహారం చేశాడు. 129 బంతుల్లో 157( 13x4, 4X6) పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. దీనితో వెస్టిండీస్ ముందు 322 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశితమైంది. టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. క్రీజులో దిగిన కొద్దిసేపటికే రోహిత్ శర్మ 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత ధావన్ మెరుపులు మెరిపించినా 29 పరుగులకే ఔటయ్యాడు. 
 
కోహ్లి వికెట్ల వద్ద పాతుకుపోయాడు. అతడికి రాయుడు తోడవ్వటంతో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా వెళ్లింది. రాయుడు 73 పరుగులు చేసి నర్స్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. 
 
ఆ తర్వాత వచ్చిన ధోనీ సిక్స్ కొట్టినా ఆట్టే నిలబడలేకపోయాడు. మైక్ కాయ్ బౌలింగులో ఔటై 20 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. పంత్ 17 పరుగులు, జడేజా 13 పరుగులు చేశారు. దీనితో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

భర్తను బంధువులతో కలిసి చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments