Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కంగారు'ల బ్యాటింగ్ బలం : ఆండ్రూ సైమండ్స్

Webdunia
శనివారం, 13 సెప్టెంబరు 2008 (16:35 IST)
భారత పర్యటనకు ఎంపిక కాకపోవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించి ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ను ఓ ప్రత్యేకమైన క్రికెటర్‌గా చెప్పుకోవచ్చు. ఆల్‌రౌండర్‌గా ఆసీస్ క్రికెట్ జట్టులోకి ప్రవేశించిన సైమండ్స్ తన బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలతో ప్రస్తుతం వరకు ఓ నమ్మదగిన ఆటగాడిగానే కొనసాగాడు.

ఆటగాడిగా క్రమశిక్షణ తక్కువని పేరు తెచ్చుకున్న సైమండ్స్ మైదానంలో మాత్రం ఎప్పుడూ తన సత్తా చూపడానికి వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థి బౌలర్‌‍పై విరుచుకుపడి బ్యాటింగ్ చేసే సైమండ్స్ ఆసీస్ జట్టులో కీలకమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్ పర్యటనకు ముందు బోర్డు మీటింగ్‌కు హాజరు కాకుండా చేపల వేటకు వెళ్లాడన్న కారణంగా నిషేధానికి గురైన సైమండ్స్ తాజాగా భారత్‌లో పర్యటించనున్న ఆసీస్ జట్టుకు సైతం ఎంపిక కాకపోవడం గమనార్హం. సైమండ్స్ ఆటగాడిగా గొప్పవాడైనా ప్రవర్తనలో మాత్రం అతను తనను తాను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది అంటూ ఆసీస్ బోర్డు పేర్కొంటున్న సమయంలో సైమండ్స్ కెరీర్ గురించి ఓసారి పరిశీలిద్దాం.

ఇంగ్లాండ్‌లో 1975 జూన్ తొమ్మిదిన జన్మించి ఆస్ట్రేలియాలో పెరిగిన సైమండ్స్ 1998లో పాకిస్థాన్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆనాటి నుంచి నేటివరకు 193 వన్డేల్లో పాల్గొన్న సైమండ్స్ 157 ఇన్నింగ్స్‌లు ఆడి 5006 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు 29 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు సైమండ్స్ ఆడిన వన్డేల్లో స్ట్రైక్ రేటు 92.78గా ఉండడం విశేషం.


అలాగే శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో టెస్టుల్లోనూ అడుగు పెట్టిన సైమండ్స్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌లలో 34 ఇన్నింగ్స్‌లు ఆడి 1295 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. వీటితోపాటు ట్వంటీ20ల్లోనూ సైమండ్స్ తన ప్రభావం చూపాడనే చెప్పవచ్చు. ఇప్పటివరకు 13 ట్వంటీ20 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లు ఆడి 337 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఇక బౌలింగ్‌లోనూ సైమండ్స్ తన ప్రభావం చూపాడు. బౌలర్‌గా టెస్టుల్లో 23, వన్డేల్లో 129 వికెట్లను సైమండ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతటి ప్రతిభ ఉంది కాబట్టే భారత్‌లో బీసీసీఐ నిర్వహించిన ఐపీఎల్ టోర్నీలో అత్యధిక మొత్తానికి అమ్ముడైన విదేశీ ఆటగాడిగా సైమండ్స్ రికార్డు సృష్టించాడు. అయితే కెరీర్‌లో ఎన్ని విజయాలున్నా వివాదాలు సైతం సైమండ్స్ వెన్నంటే వచ్చేవి.

భారత స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్‌కు సైమండ్స్‌కు మధ్య జరిగిన వివాదం క్రికెట్ చరిత్రలో ఎంతటి వివాదాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. అదేసమయంలో సొంత జట్టు సభ్యులతోనూ సైమండ్స్ అప్పుడప్పుడు గొడవలు పడేవాడనే వార్తలూ వినవచ్చాయి. సొంత జట్టు సభ్యులతో జరిగిన గొడవే ప్రస్తుతం సైమండ్స్ నిషేధానికి గురికావడానికి ప్రధాన కారణమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ వార్తల నడుమ సైమండ్స్ పని ఇక అయిపోయిందని ఆసీస్ జట్టులో ఇకపై సైమండ్స్ పూర్తిగా కన్పించకపోవచ్చని వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిభ కల్గిన ఆటగాడిగా సైమండ్స్ తన భవిష్యత్ కెరీర్‌ను ఎలా రూపొందించుకోనున్నాడనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదేమో.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

Show comments