Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వారం లెజెండ్: ముత్తయ్య మురళీధరన్

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2007 (20:30 IST)
టెస్ట్ క్రికెట్‌ ప్రపంచంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరుడిగా శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో మురళీధరన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఆసీస్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (708) పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును అధికమించిన ఏకైక ఆఫ్ స్పిన్నర్‌గా మురళీధరన్ కావడం విశేషం.

శ్రీలంకలోని కాండీ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ పాల్ కాలింగ్‌వుడ్ వికెట్‌ను పడగొట్టి.. తాను గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ రికార్డు కలను సాఫల్యం చేసుకున్నాడు. అలాగే గత రికార్డును తిరగరాసిన మురళీధరన్ వికెట్ల వేట ఇంకా కొనసాగుతోంది.

తక్కువ మ్యాచ్‌లలో అరుదైన రికార్డు..
ప్రపంచ రికార్డులు నెలకొల్పిన షేన్ వార్న్‌కు, మురళీధరన్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 145 టెస్ట్ మ్యాచ్‌లలో 708 వికెట్లను వార్న్ నేలకూల్చగా, మురళీధరన్ మాత్రం.. కేవలం 116 టెస్టుల్లోనే 710 వికెట్లు పడగొట్టాడు. ఇంకా పడగొడుతున్నాడు. అంతేకాకుండా ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్లను మొత్తం 60 సార్లు తీయగా, వార్న్ మాత్రం 37 సార్లు మాత్రమే తీశాడు. అలాగే... పది వికెట్లను మురళి 20సార్లు పడగొట్టగా, వార్న్ 10 సార్లు గిరాటేశాడు.

ఆసీస్‌పైనే టెస్ట్ అరంగేట్రం..
ఈ 35 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్ ఆస్ట్రేలియాపైనే అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేశాడు. 1992లో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో రంగప్రవేశం చేసి, ఆసీస్ బ్యాట్స్‌మెన్ మెక్‌డర్మెట్ వికెట్‌ను తొలి వికెట్‌గా తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ప్రారంభమైన మురళీధరన్ వికెట్ల వేట.. టెస్ట్ జట్టులు ఆడే అన్ని దేశాలపై యాభై వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా వార్న్ తీసిన 710 వికెట్లలో స్వదేశంలో 438, విదేశాల్లో 272 వికెట్లు తీయడం గమనార్హం.

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు...
మురళీధరన్ ఈ రికార్డును సొంతం చేసుకోవడానికి ఎన్నో ఎత్తుపల్లాలను అధికమించాడు. ముఖ్యంగా.. ఆస్ట్రేలియా పర్యటనలో జాతి వివక్షతను కూడా లంక స్పిన్నర్ ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా.. తన బౌలింగ్ శైలి దూస్రాగా సాగుతోందని ఆసీస్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేయడం... ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్‌కు శల్య పరీక్షలు ఎదుర్కొనడం జరిగింది. ఇలా.. ప్రపంచంలో ఏ బౌలర్ కనుచూపు మేరలో అందుకోనంతగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

బయోడేటా...
పూర్తి పేరు.. ముత్తయ్య మురళీధరన్.
పుట్టిన తేదీ.. ఏప్రిల్ 17, 1972.
ప్రస్తుత వయస్సు.. 35 సంవత్సరాల 241 రోజులు.
ఆడే జట్లు.. శ్రీలంక, ఏసీసీ ఆసియన ్XI, వరల్డ్- XI, లాంక్‌షైర్, తమిళ్ యూనియన్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్.
బ్యాటింగ్ శైలి.. కుడిచేతి వాటం.
బౌలింగ్ శైలి.. రైట్ ఆర్మ్-ఆఫ్ బ్రేక్.
ఎత్తు.. 5 అడుగుల 7 అంగుళాలు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

15 చోట్ల పగిలిన తల... 4 ముక్కలైన కాలేయం... బయటకొచ్చిన గుండె... జర్నలిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు!

ఓయో రూమ్స్: బుకింగ్ పాలసీలో ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? జంటలు తమ రిలేషన్‌కు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది?

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

పులిని చుట్టుముట్టిన సఫారీ వాహనాలు.. హైకోర్టు సీరియస్ (Video)

పాడుబడిన ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె - ఎముకలు... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

Show comments