Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రాత్రికి ఆసీస్‌కు కంటినిండా నిద్రే మరి..!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2008 (19:36 IST)
ఒకే టెస్ట్ ఇన్నింగ్స్.. మొట్ట మొదటి రోజు.. నాలుగు అరుదైన రికార్డులు.... అంటే బ్రియన్‌లారా రికార్డు బద్దలు గొట్టడం, టెస్ట్ క్రికెట్‌లో సచిన్ తన 50వ అర్ధ సెంచరీని నమోదు చేయడం... కాస్సేపయ్యాక 12 వేల పరుగుల చరిత్ర నమోదు చేయడం. గంగూలీ టెస్ట్ క్రికెట్‌లో 7 వేల పరుగులు చేసిన నాలుగో భారతీయ క్రికెటర్‌గా పేరుకెక్కడం.. ఇన్ని అరుదైన ఘటనలు నమోదైన తర్వాత సచిన్ వికెట్ పడింది. ఆ వికెట్ పడగానే క్రికెట్ కామెంటేటర్లు ఏకగ్రీవంగా చేసిన వ్యాఖ్య ఒకటే.. ఆసీస్ క్రికెట్ జట్టుకు ఈ రాత్రికి కంటినిండా కునుకే మరి..!

ఇదీ గత 19 ఏళ్లుగా క్రికెట్ తన ఊపిరిగా, మంత్రోచ్ఛాటనలా మార్చుకుని అంతర్జాతీయ క్రికెట ప్రపంచాన్ని శాసిస్తూ వచ్చిన ఓ అసాధారణ క్రికెటర్ ఆయా టీమ్‌లకు ఇచ్చిన క్రికెట్ ఎఫెక్ట్. సచిన్ ఎప్పుడైనా ఇంతే... తను రికార్డును ఛేదిస్తున్నప్పుడు చూడాలి ప్రేక్షకులు అనుభవించే మజా.. గత ఇరవయ్యేళ్లుగా ప్రేక్షకులు ఇదే మజా ఆస్వాదించారు. ఇప్పుడు ఈ శుక్రవారం మొహాలీలో ఇదే అనుభవాన్ని మరోసారి అనుభవించారు కూడా.. మామూలుగా కాదు... క్రికెట్ చరిత్రలో కలకాలం గుర్తుండిపోయేలా...

ఈ రోజు తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసి లారా రికార్డును ఛేదించడంతోటే సచిన్ ఆగిందీ లేదు. కాస్సేపయ్యాక 12వేలవ పరుగును తన ఖాతాలో వేసుకున్నప్పుడూ బ్యాట్‌కు విరామం కల్పించిందీ లేదు. అద్భుతమైన టైమింగ్, బంతిని తరలించడం నిజంగా అద్భుతం. అందుకే 80 పరుగులు దాటాక సచిన్ వికెట్ పడగానే ఆసీస్ టీమ్‌లో కాసింత ఉపశమనం. అమ్మయ్య బతికాం...

మరోవైపు సచిన్ ఈ చారిత్రక విజయాన్ని ఎప్పటిలాగే తన శైలిలో సాదా సీదాగానే తీసుకున్నాడు. బెంగుళూరు టెస్టులో తాను అవుటయ్యాక కొంతమంది తన రికార్డు గురించి గుర్తు చేశారని అయితే అవసరమైనప్పుడు జట్టుకు ఆలంబనగా ఆ టెస్టులో నిలబడ్డాడనే సంతృప్తి పడ్డాను తప్ప రికార్డు పూర్తి చేయలేదని భావించలేదని సచిన్ పేర్కొన్నాడు.

ఈ రోజు సైతం తాను బంతిని అలా పరిశీలించుకుంటూ వెళ్లానని సచిన్ అన్నాడు. గత 19 ఏళ్లుగా తన క్రికెట్ ప్రస్థానం అద్భుతంగానే సాగిందని చెప్పాడు. ఏ రంగంలో అయినా మనపై రాళ్లు పడతాయి కాని వాటిని మైలురాళ్లుగా మార్చుకోవడమే మనం చేయవలసిన పని అని సచిన్ పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే ఈ రోజు సాధించిన ఘనతకు తానేమీ ఉబ్బిపోలేదని, ఉద్వేగానికి గురి కాలేదని తెలిపాడు. తన లక్ష్యం రికార్డు ఛేదించిన తర్వాత కూడా ఆటలో కొనసాగాలని, ఏకాగ్రతను కోల్పోకూడదనే భావించానని అన్నాడు. గంగూలీ, తాను ఈ రోజు చక్కని ఆట ప్రదర్శించామని అన్నాడు.

తాను ఎల్లప్పుడూ రికార్డులను మనసులోంచి తీసి పక్కన పెడుతుంటానని, జట్టుకు దోహదం చేయడమే తన లక్ష్యంగా ఉంటుందని సచిన్ చెప్పాడు. అయితే ఈ ఘనత సరైన సమయంలోనే దక్కిందని, నాణ్యతకు మారుపేరైన ఆసీస్ జట్టుపై రికార్డు ఛేదించడం సంతోషం కలిగించిందని అన్నాడు.

అయితే రోజు ముగిసేంత వరకూ క్రీజులో ఉండాలని తలిచినప్పటికీ అలా జరగలేదని చెప్పాడు. అవుటైన బంతిని ఎదుర్కొన్నప్పుడు తన కాలిని సరిగా ఉపయోగించలేకపోయానని చెప్పాడు. అయితే క్రికెట్ ఆట తీరే అదని సచిన్ అభివర్ణించాడు. బంతి గతి మారుతుంది.. దాంతో పాటు ఆట కూడా మారిపోతుందని సచిన్ తాత్వికంగా అన్వయించాడు.

సచిన్ సాధించిన ఈ ఫీట్‌ను తలకెత్తుకుంటూనే భారతీయ బౌలర్ ఇషాంత్ శర్మ ఈ రోజు ఆటలో టెస్ట్ క్రికెట్‌లో మొత్తం వంద పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఒక అరుదైన దిగ్గజం రికార్డు బద్దలయినపుడు ఒక వర్ధమాన క్రికెటర్ సాధించిన చిన్న ఫీట్‌ను కూడా గుర్తుంచుకోవడం మంచిదే కదా...
అన్నీ చూడండి

తాజా వార్తలు

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. ఆరేళ్ల నుంచి ఇదే తంతు

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

Show comments