Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా బౌలింగ్ వీరుడు... బ్రెట్‌లీ

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (16:02 IST)
భారత్‌లో మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల బలాబలాపై సాధారణంగానే చర్చ మొదలైంది. ప్రపంచ ఛాంపియన్లు అయిన ఆస్ట్రేలియాకు అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లను కలిగిన భారత్‌కు మధ్య సిరీస్ అంటే సాధారణంగానే అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది.

ఎలాంటి పిచ్‌లపైన అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే సత్తా ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో పోటీ అంటే విజయావకాశాలు ఎక్కువగా ఆ జట్టుకే ఉంటాయనేది అందరి భావన. అయితే ఈ భావనకు విరుద్ధంగా ఈ సిరీస్‌లో మాత్రం భారత్‌నే అందరూ ఫేవరెట్‌గా భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా జట్టులో సీనియర్లు లేకపోవడం అలాగే తాజా జట్టులోని చాలామందికి భారత గడ్డపై ఆడిన అనుభవం లేకపోవడం తదితర కారణాల దృష్ట్యా ఈ వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటతీరును సమూలంగా మార్చేసే స్వభావం ఆస్ట్రేలియా సొంతం. అలా ఆ జట్టులోని మెరికల్లాంటి బౌలర్లలో భారత భరతం పట్టగలిగే అవకాశమున్న వారిలో బ్రెట్‌లీ ముందువరుసలో ఉన్నాడు.

భారత గడ్డపై ఆడిన అనుభవం లేకపోయినా భారత ఆటగాళ్లతో ఎక్కువగా ఆడిన అనుభవమే ప్రస్తుత సిరీస్‌లో బ్రెట్‌లీకి అక్కరకు రానుంది. అందుకే ప్రస్తుత సిరీస్‌‍లో ఆస్ట్రేలియా బౌలింగ్ ఆయుధంగా అందరూ బ్రెట్‌లీ పేరే ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రెట్‌లీ సామర్ధ్యం గురించి కాస్త పరిశీలిస్తే...


దాదాపు తొమ్మిదేళ్లుగా ఆస్ట్రేలియా జట్టుకు సేవలందిస్తున్న బ్రెట్‌లీ అంతర్జాతీయ అరంగేట్రమే భారత్‌పైనే జరగడం విశేషం. మెల్బోర్న్‌లో 1999 డిసెంబర్‌లో జరిగిన టెస్ట్ ద్వారా బ్రెట్‌లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి టెస్ట్‌లోనే తన సత్తా చాటిన బ్రెట్‌లీ ఈ టెస్ట్‌లో ఏడు వికెట్లు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఇక అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన బ్రెట్‌లీ ఇప్పటివరకు ఆడిన 68 టెస్టుల్లో 289 వికెట్లు సాధించాడు. అలాగే వన్డేల్లోనూ 173 మ్యాచ్‌లలో 303 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బౌలర్‌గా ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ భరతం పట్టే బ్రెట్‌లీ ఇప్పటివరకూ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు.

ఈ కారణంగా భారత గడ్డపై ఆడిన అనుభవం లేకపోయినా భారత ఆటగాళ్ల బలాబలాలు బాగా తెలిసిన బౌలర్‌గా బ్రెట్‌లీ తాజా సిరీస్‌లో తన ప్రభావం చూపగలడని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

Show comments