కఠినంగా లాక్ డౌన్.. తాట తీస్తున్న పోలీసులు.. ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపేశారు..

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (21:09 IST)
కరోనాను నియంత్రించేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో... పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అనవసరంగా బయట తిరిగే యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. 
 
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలకు కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించి, ఐసోలేషన్‌కు తరలించారు. జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎలకంటీ, షేట్ పల్లి, గ్రామాలలో పెట్రోలింగ్ చేస్తుండగా యువకులు బలాదూర్‌గా తిరగుతూ పోలీసులకు చిక్కారు. 
 
కరోనాతో తమకు సంబంధం లేదన్నట్టు బాధ్యతా రాహిత్యంతో నిబంధనలు గాలికి వదిలి బయట తిరుగుతున్నారు. దీంతో 14 మందిని పట్టుకొని వారికి రాపిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చినా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
 
జైపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులకు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని లేదంటే ఐసోలేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments