Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు లక్షన్నర మంది

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు ఏకంగా లక్షన్నర మంది మృత్యువాతపడ్డారు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 22 లక్షలకు చేరుకోగా, మరో దాదాపు ఆరు లక్షల మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 
 
తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి 1,54,25 మంది చనిపోయారు. వరల్డ్ వైడ్‌గా 22,50,683 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే, 5,72,076 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 
 
ఇకపోతే, అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా అగ్రరాజ్యం అమెరికా ఉంది. ఇక్కడ ఇప్పటికే ఏకంగా 32,230 మంది చనిపోయారు. అలాగే, స్పెయిన్‌లో 20,002 మంది, ఇటలీలో 22,745 మంది, ఫ్రాన్స్‌లో 18,681, జర్మనీలో 4,352, బ్రిటన్‌లో 14,576, చైనాలో 4,632, ఇరాన్‌లో 4,958, టర్కీలో 1,769, బెల్జియం‌లో 5,163, బ్రెజిల్‌లో 2,171, కెనడాలో 1301, కెనడాలో 3,459, స్విట్జర్లాండ్‌లో 1,327 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే, భారత్‌లో మాత్రం ఈ మరణాలు కేవలం 480గా ఉన్నాయి. అలాగే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 14378గా నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో 50 కొత్త  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1360 కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments