Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 24 గంటల్లో 2700 కరోనా మృతులు

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (08:24 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఫలితంగా బుధవారం ఒక్కరోజే ఏకంగా కొత్తగా 1,95,121 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా తారాస్థాయిలో ఉంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 2731 మంది కరోనా వైరస్ బాధితులు మృత్యువాతపడ్డారు. 
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,43,13,941కు చేరింది. ఇందులో 55,71,729 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 84,62,347 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 
 
దేశంలో కరోనా బారినపడి చనిపోయినవారి సంఖ్య ఇప్పటివరకు 2,79,763కు చేరింది. బుధవారం 2731 మంది మరణించడంతో.. ఏప్రిల్‌ తర్వాత ఇంత పెద్దసంఖ్యలో బాధితులు మృతిచెందడం ఇదే కావడం గమనార్హం.
 
ఇకపోతే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,48,03,583కు చేరుకోగా.. మరణాల సంఖ్య 14,98,190కు పెరిగింది. మరో 1,84,00,925 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,49,34,851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉండగా, భారత్‌, బ్రెజిల్‌, రష్యా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, యూకే తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments