Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి ఇరానీకి కరోనా : ఏపీలో కొత్త పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (21:20 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు ఈ వైరస్ సోకగా, వారంతా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని తిరిగి కోలుకున్నారు. వీరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. 
 
తనకు కరోనా సోకినట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. తనతో కాంటాక్ట్ అయినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పారు. మరోవైపు, స్మృతి త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ట్వీట్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 2,949 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,14,774కి చేరుకుంది. మొత్తం 6,643 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇంకోవైపు, గత 24 గంటల్లో 3,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం 77,028 మంది కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. 
 
ప్రస్తుతం ఏపీలోని జిల్లాల్లో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 1259, చిత్తూరు 2679, ఈస్ట్ గోదావరి 4877, గుంటూరు 3603, కడప 1404, కృష్ణ 3082, కర్నూలు 485. నెల్లూరు 288, ప్రకాశం 1705, శ్రీకాకుళం 987, విశాఖపట్టణం 2048, విజయనగరం 2048, వెస్ట్ గోదావరి 3836 చొప్పున మొత్తం 26622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments