Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్.. వచ్చేవారంలో ఫైజర్ వచ్చేస్తోంది..

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (14:02 IST)
కరోనా వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఫైజర్‌-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ వినియోగానికి రానుంది. వచ్చే వారంలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఫైజర్‌-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించాలని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చేసిన సిఫారసును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. 
 
యునైటెడ్ కింగ్‌డమ్ వ్యాప్తంగా వచ్చే వారం నుంచే ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి సాధించడంపై ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎంహెచ్ఆర్ఏకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
 
తాము మరిన్ని దేశాల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యత ఉన్న వ్యాక్సిన్‌లను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బ్రిటన్‌లోని ఆసుపత్రులన్నీ వ్యాక్సిన్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారంలోనే ఈ కార్యక్రమం మొదలవుతుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ చెప్పారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments