దేశంలో కొత్తగా మరో 31 వేల పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:35 IST)
దేశంలో కొత్తగా మరో 31 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... గత 24 గంటల్లో కొత్తగా 31,222 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,58,843కి చేరింది. అలాగే, నిన్న 42,942 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 290 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,042కి పెరిగింది. 
 
మరోవైపు, ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,22,24,937కు చేరింది. మరో 3,92,864 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69,90,62,776 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 19,688 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న‌ 135 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments