కరోనా రోగి ఆస్పత్రికి... దొంగలు ఆ ఇంట్లో చొరబడి చపాతీలు, మటన్ లాగించి....?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (17:41 IST)
Mutton Chappathi
కరోనా కేసులు అధికంగా వున్న ప్రాంతాలను కంటైన్మైంట్ జోన్‌గా ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా వుండటం.. ప్రజలు అధికంగా సంచరించకపోవడం వంటివి అకృత్యాలకు పాల్పడేవారికి బాగా కలిసొచ్చేలా చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో దొంగలు బాగా దోచేసుకుంటున్నారు. జార్ఖండ్‌లో ఇలా ఇళ్లల్లో పడి దోచుకునే నేరాలు పెరిగిపోతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. అక్కడ కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడంతో.. అతడి భార్య, పిల్లల్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇక, అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. 
 
నెల రోజులుగా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అదే అదునుగా భావించిన దొంగలు.. ప్లాన్ చేసుకుని ఆ ఇంట్లోకి చొరబడ్డారు.. అది కంటైన్మెంట్ జోన్ కూడా కావడంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో రాత్రి మటన్ కర్రీ, చపాతీలు.. ఇలా వంట చేసి విందు చేసుకున్నారు.
 
ఆ తర్వాత ఇంట్లో ఉన్న రూ.50 వేలు, దొరికినకాడికి నగలు దోచుకుని పారిపోయారు. కానీ ఆ ఇంటిని చూసొద్దామని కరోనా రోగి సోదరుడు వెళ్తే.. అతడు ఖంగుతిన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments