తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. 256 పాజిటివ్‌ కేసులు

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (09:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఎగంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 256 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. 
 
సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,581కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 298 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,86,542కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,005 ఉండగా వీరిలో 2,283 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 51 కేసులు నమోదయ్యాయి.
 
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,861 శాంపిల్స్‌ను పరీక్షించగా 81 కేసులు మాత్రమే నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,86,066కి చేరింది. విశాఖలో కరోనాతో ఒకరు మృతిచెందడంతో మరణాల సంఖ్య 7,141కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్

తర్వాతి కథనం
Show comments