కరోనా అప్డేట్.. కరోనా ఫ్రీగా రాయల సీమ.. తెలంగాణ సంగతేంటంటే?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (13:55 IST)
ఏపీలో ఒక్కరోజే కోవిడ్ కారణంగా 18 మంది చనిపోయారు. కిందటి రోజుతో(22) పోల్చుకుంటే మరణాల స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 13,042కు పెరిగాయి. కొత్తగా గుంటూరు జిల్లాలో నలుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావని, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. 
 
కోవిడ్ బారి నుంచి కొత్తగా 3,034 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 18,87,236కు పెరిగాయి. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,710గా ఉంది. ఇప్పటిదాకా చేసిన టెస్టుల సంఖ్య 2,31,30,708గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్క జిల్లాలో కూడా 500ల సంఖ్య దాటలేదు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో 100 లోపే కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమలో ఒక జిల్లా మాత్రం కరోనా ఫ్రీ దిశగా అడుగులు వేస్తోంది.
 
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో ముగ్గురు మరణించారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 6,33,146కి చేరగా, కరోనా వైరస్‌తో 3,738 మంది మరణించారు. రాష్ట్రంలో 10,064 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం 6,19,344 యాక్టివ్‌ కేసులు ఉండగా, 24 గంటల్లో 848 మంది రికవరీ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: పెద్ది ఐటెం సాంగ్ కోసం ఇంత రచ్చ చేయాలా !

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments