తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్.. తెలంగాణలో 1,500 మార్కుకు చేరిన మృతుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:55 IST)
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కోవిడ్-19 కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,891 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,878 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535కి చేరింది. 
 
ఇప్పటివరకు మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,500 మార్కుకు చేరింది. ప్రస్తుతం 26,374 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 175 కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు ఏపీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 66,944 శాంపిల్స్ పరీక్షించగా మరో 5292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,36,824కు చేరింది. 
 
గడిచిన 24 గంటల్లో 42మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6128కి చేరింది. గత 24 గంటల్లో 6,120మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,84,930 నమోదయ్యింది. మరో 48,661మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments