Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టును తాకిన కరోనా.. జ్యూడీషియల్ విభాగ ఉద్యోగికి వైరస్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (08:50 IST)
కరోనా వైరస్ ఇపుడు సుప్రీంకోర్టునూ తాకింది. ఈ అత్యున్నత న్యాయస్థానంలోని జ్యూడీషియల్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. ఈ నెల 16వ తేదీన ఆయన విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనో పాటు.. మరో ఇద్దరు రిజిస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు తరలించారు. 
 
కరోనా వైరస్ దేశంతో పాటు... ప్రపంచాన్ని ఓ ఊపు ఊపుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలను కుదిపేసిన ఈ వైరస్ ఇప్పటికే అనేక ప్రభుత్వ విభాగాల్లో పని చేసే సిబ్బందికి సోకింది. కేంద్ర మంత్రులు పేషీల్లో పని చేసే సిబ్బందికి కూడా సోకింది. ఇపుడు సుప్రీంకోర్టు ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. 
 
సుప్రీంకోర్టు జుడీషియల్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. ఈ నెల 16న విధులకు హాజరైన ఆయన ఆ తర్వాత రెండు రోజులపాటు జ్వరంతో బాధపడడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఇద్దరు రిజిస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు. అలాగే, 16వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments