అనంతగిరిలో కరోనా ఆస్పత్రి... వందతులు నమ్మొద్దు...

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (18:42 IST)
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులోభాగంగా, ప్రత్యేకంగా కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
 
ప్రజలకు దూరంగా 'కరోనా' బాధితులకు చికిత్స అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 'కరోనా' బాధితుల కోసం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి వద్ద ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేసింది.
 
మరోవైపు, తెలంగాణాలో కరోనా వైరస్ బారినపడివారి సంఖ్య పెరుగుతున్నట్టు వస్తున్న పుకార్లపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 'కరోనా' వైరస్ సోకిందన్న వదంతులను నమ్మొద్దని, ఈ వైరస్ బారిన ఎవరూ పడలేదని స్పష్టం చేశారు.
 
హైదరాబాద్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ‘కరోనా’ వైరస్ వ్యాపించిందంటూ సోషల్ మీడియాతో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ‘కరోనా’పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, వారి బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పుణేకు పంపామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments