Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా కావాలంటే.. ఆ యాప్ గురించి తెలుసుకోవాల్సిందే...

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (12:11 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్ని టీకాల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులోభాగంగా, కొన్ని ఫార్మా కంపెనీలు పలు వ్యాక్సిన్లను తయారు చేశాయి. ఈ వ్యాక్సిను పలు దేశాల్లో పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. 
 
అలాగే, మన దేశంలో కూడా డిసెంబరు 25వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. జనవరి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయి. తొలి దశలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, వయో వృద్ధులకు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
 
ఇకపోతే, ఇదే కరోనా టీకా తీసుకోవాలని భావించే ఇతరులు సహా ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవడం తప్పనిసరని, అందుకోసం 'కో-విన్' పేరిట ప్రత్యేక డిజిటల్ ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేశామని కేంద్ర అధికారులు వెల్లడించారు. 
 
అతి త్వరలోనే ఇది యాప్ రూపంలో స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకునేందుకు విడుదల చేయనున్నామని అన్నారు. ఇందులో రిజిస్టర్ చేసుకున్న వారందరి డేటాబేస్ ప్రభుత్వం వద్ద ఉంటుందని, వారికి సంబంధించిన కొవిడ్-19 సంబంధిత డేటానూ సేకరించి పెడతామని అధికారులు వెల్లడించారు.
 
వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రాధాన్యతా క్రమంలో ఈ యాప్ ద్వారా నమోదు చేసుకున్నవారికి అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి మెసేజ్ వస్తుందని, అందులో వారు ఎక్కడ టీకాను తీసుకోవాలి? రెండో డోస్ గురించిన సమాచారం కూడా ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments