మ‌రోసారి సోనూసూద్ విత‌ర‌ణ‌.. శవాల శివకు ఆంబులెన్స్

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (18:16 IST)
sonu sood
కరోనా కష్టకాలంలో ఒక్క‌సారిగా పాల‌కుల‌కంటే వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్న వ్య‌క్తి సోనూసూద్‌. దేశంలో ఏ రాష్ట్రంలో ఎవ‌రికి ఎటువంటి ఆప‌ద వున్నా త‌నున్నానంటూ ముంద‌డుగు వేస్తున్నాడు. వారిలో భ‌రోసా నింపుతున్నాడు. 
 
తాజాగా హైద‌రాబాద్‌లో మ‌రోసారి ఆయ‌న త‌న ఆద‌ర‌ణ‌ను చూపాడు. హైద‌రాబాద్‌లో టాంక్‌బంక్‌ల‌పై ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఎవ‌రు చ‌నిపోయినా ఆత్మ‌హ‌త్య చేసుకున్నా.. శ‌వాల‌ను వెలుగులోకి తెచ్చేవాడు. ఆయ‌నే శివ‌. శ‌వాల శివగా పేరు సుప‌రిచితం అయింది. 
 
అయితే ఈ శ‌వాల శివ కొత్త అంబులెన్స్‌ను స‌మ‌కూర్చుకున్నాడు. అందుకు సోనూసూద్ కూడా సాయం చేశాడో ఏమో తెలీదుకానీ.. ఆంబుల‌న్స్‌ను సోనూసూద్ పేరు పెట్టాడు. శివ గురించి తెలిసిన సోనూసూద్ ఈరోజు స్వ‌యంగా శివ ఇంటికి వెళ్ళి అభినందించాడు. 
 
అంతేకాకుండా ముందుముందు ఏమి కావాల‌న్నా తాను ఉన్నాన‌ని శివ‌కు భరోసా ఇచ్చాడు. పాల‌కులు చేయాల్సిన ప‌నిని సోనూసూద్ చేసినందుకు ఆయ‌న ముందే అభినందించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments