Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించి తిరిగి వస్తానని కోవిడ్ కాటుతో కన్నుమూసిన మాజీ మంత్రి

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (18:09 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా సేవలు అందించిన పైడి కొండల మాణిక్యాలరావు (60) మృతి చెందారు. గత నెల రోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు.
 
నాకు కరోనా వచ్చింది అయినా ఎంతో ధైర్యంగా ఉన్నా. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా తిరిగి వస్తానని గత కొన్ని రోజులు క్రితం వీడియో కూడా పంపిచారు. ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిత్రులు, అభిమానులు, పార్టీ వర్గాలు. సుదీర్ఘ కాలంగా ఆర్.ఎస్.ఎస్‌తో పనిచేసిన మాణిక్యాలరావుకు సౌమ్యుడుగా మంచి పేరుంది.
 
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు మాణిక్యాలరావు.
 
1989 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన హయాంలో జీర్ణావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని తాడేపల్లిగూడెంకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments