Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది : ఆరోగ్య మంత్రి సుధాకర్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (10:01 IST)
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి మొదలైందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యమంత్రి సుధాకర్‌ చెప్పారు. కరోనా కేసుల పెరుగుదలకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని నిపుణులు చెప్తున్నారు. అందువల్ల వచ్చే మూడు నెలల పాటు అత్యంత కీలకమని, ఈ మూడు నెలలు ప్రజలు అత్యంత జాగ్రత్తతో ఉండాలని కోరారు. 
 
కరోనా టీకా తీసుకొన్నవారు రక్తాన్ని దానం చేయడంపై నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ కౌన్సిల్‌ (ఎన్‌బీటీసీ) మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్‌ ఏ కంపెనీది అన్నదానితో సంబంధం లేకుండా.. టీకా రెండో డోసు తీసుకొన్న 28 రోజుల వరకు రక్తం దానం చేయవద్దని సూచించింది.
 
మరోవైపు, మహారాష్ట్రలో 27,126, పంజాబ్‌లో 2,578, కేరళలో 2,078, కర్ణాటకలో 1,798, గుజరాత్‌లో 1,565, మధ్యప్రదేశ్‌లో 1,308 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది.
 
వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెంచాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 8 నగరాల్లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూని విధించనున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం తెలిపింది. కేసుల పెరుగుదల దృష్ట్యా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments