Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఇండియన్ వేరియంట్" అనే పదం వాడారో.. అంతే సంగతులు!

Webdunia
శనివారం, 22 మే 2021 (09:10 IST)
"ఇండియన్ వేరియంట్" అనే పదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పదాన్ని ఉపయోగిస్తూ... సోషల్ మీడియాలో చాలా మంది దేశ పరువు తీస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
కరోనా వైరస్‌లోని డబుల్ మ్యూటెంట్ అయిన B.1.617ను చాలా మంది సోషల్ మీడియాలో... ఇండియన్ వేరియంట్ అని చెబుతున్నారు. ఐతే... ఇది ఇండియన్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎక్కడా చెప్పలేదు. దీన్ని వేరియబుల్ ఆఫ్ కన్సర్న్ అని మాత్రమే చెప్పింది. అంటే... ఈ వైరస్ వేర్వేరు దేశాల్లో విస్తరిస్తోందని అర్థం. అంతే తప్ప... దీనికీ, ఇండియాకీ సంబంధం ఉంది అని WHO చెప్పలేదు.
 
చాలా మంది సోషల్ మీడియాలో... దీన్ని ఇండియన్ వేరియంట్ అని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే కేంద్ర సమాచార శాఖ ఫైర్ అవుతోంది. ఎవరైనా సరే... ఈ పదాన్ని ఇండియాకి లింక్ పెట్టి వాడి ఉంటే... తొలగించాల్సిందిగా నోటీస్ జారీ చేసింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే తామూ ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది. 
 
సో... నెటిజన్లు ఎవరైనా ఎక్కడైనా సోషల్ మీడియా సైట్లలో... B.1.617ను ఇండియన్ వేరియంట్ అని చెప్పి ఉంటే... వెంటనే ఆ వాక్యాన్ని తొలగించాల్సి ఉంటుంది. లేదంటే... చట్టపరమైన చర్యలు తప్పవు అని కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments